Site icon NTV Telugu

Chennai Crime: రన్నింగ్ ట్రైన్ హత్య కేసులో ప్రియుడు అరెస్టు

Chennai Crime

Chennai Crime

Chennai Crime: రన్నింగ్ ట్రైన్ నుండి యువతీని తోసేసి హత్య చేసిన ఘటనలో ప్రియుడు సతీష్ అరెస్టు చేసారు చెన్నై పోలీసులు. నిన్న మధ్యాహ్నం చైన్నైలోని సెయింట్ ధామస్ రైల్వే స్టేషన్ లో లోకల్ ట్రైన్ నుండి సత్య అనే యువతిని ప్రేమ నిరాకరించడంతో సతీష్ అనే యువకుడు తోసేశాడు. దీంతో సత్య స్పాట్ లోనే చనిపోయింది. యువతి సత్య బికాం చదువుతుంది. అందరూ చూస్తుండగానే సతీష్ అనే వ్యక్తి 20 ఏళ్ల సత్యప్రియను తోసేయడంతో రైలు కింద పడి మరణించింది. అనంతరం సతీష్ అక్కడనుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏడు బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితున్ని అదుపులో తీసుకున్నారు.

Read also: Lakshmi Kataksham Bhakthi Tv Live: మీరు కోరిన కోరికలు తీరి లక్ష్మీ కటాక్షం పొందాలంటే..

చెన్నైలోని ఆదంబాక్కంకు చెందిన సత్యప్రియ నగరంలోని ఓ కాలేజీలో బీకాం చదువుతోంది. మృతురాలి తల్లి పోలీస్ కానిస్టేబుల్, తండ్రి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సతీష్ కు సత్యప్రియతో పరిచయం ఉంది. ఈఘటన జరగడానికి ముందు రైల్వే స్టేషన్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తాంబరం నుంచి ఎగ్మోర్ వైపు వెళ్తున్న రైలు కిందకు సత్యప్రియను ప్లాట్‌ఫారమ్‌పై నుంచి తోసేశాడు. రైలు కింద పడి సత్యప్రియ అక్కడిక్కడే మరణించింది. అయితే వీరిద్దరి మధ్య వివాదం నడుస్తోందనివారి కుటుంబాలకు కూడా తెలుసని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన జరిగిన తర్వాత సతీష్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. నిందితుడు సతీష్ కోసం ఏడు బృందాలు ఏర్పాటు చేసి ఎట్టకేలక అరెస్ట్‌ చేసారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version