Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం అంతరిక్ష రంగంలో భారత్ కీర్తిని మరింత పెంచింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా, అమెరికా, రష్యా, చైనాల తర్వాత చంద్రడిని ముద్దాడిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించింది. అత్యంత కఠినమైన దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యే ప్రక్రియలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రయోగం గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రయాన్-3ని అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిబడని రాకెట్ ప్రయోగాన్ని 4 సెకన్లు ఆలస్యం చేసినట్లు ఇస్రో వెల్లడించింది.
Read Also: Sahil Khan: 40 గంటల పాటు 5 రాష్ట్రాల్లో ఛేజింగ్.. 1800 కి.మీ ఛేజ్ తర్వాత అరెస్ట్!
ఈ 4 సెకన్ల ఆలస్యం వల్ల చంద్రయాన్-3ని రక్షించుకోగలిగాం. చంద్రయాన్-3, జూలై 14, 2023న శ్రీహరికోట నుంచి ప్రయోగించబడింది. అయితే, రాకెట్ ప్రయోగానికి కొన్ని క్షణాల ముందు ‘‘అంతరిక్ష వ్యర్థాల’’ నుంచి తాకిడికి గురయ్యే ప్రమాదం ఉందని ఇస్రో ఖచ్చితమైన పర్యవేక్షణ వ్యవస్థలు గుర్తించాయి. ఎంతో కీలకమైన ఫస్ట్ ఆర్బిటల్ ఫేస్‌లో ఈ వ్యర్థాలను తాకే అవకాశం ఉంది, దీంతోనే అనుకున్న సమయం కన్నా 4 సెకన్లు ఆలస్యంగా రాకెట్ నింగిలోకి ఎగిసింది. అంతరిక్ష ప్రయోగాలు జరిగిన సందర్భంలో రాకెట్, ఉపగ్రహాల నుంచి విడిపోయిన నట్లు, బోల్టులు, ఇతర మెటర్ వస్తువులు అంతరిక్షంలో భూమి చుట్టూ సెకన్‌కి 8-10 కి.మీ వేగంతో పరిభ్రమిస్తుంటాయి. వీటిని అంతరిక్ష వ్యర్థాలుగా పేర్కొంటారు.
ఈ నాలుగు సెకన్లు చంద్రయాన్-3 అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే ముప్పును తప్పించాయి. చంద్రయాన్ చంద్రుడి వైపు ప్రయాణాన్ని కొనసాగించేలా చేశాయి. స్పేస్ సిట్యుయేషనల్ అసెస్‌మెంట్ రిపోర్ట్ (ISSAR) ద్వారా, ఎలా ISRO తన అంతరిక్ష ఆస్తుల భద్రతను నిర్వహించడానికి అధునాతన సాంకేతికతలను, వ్యూహాత్మక ప్రణాళికలను ఉపయోగించడంలో తన నైపుణ్యాన్ని వెల్లడించింది. ఇస్రో తన తాజా నివేదికలో ఉపగ్రహాలను రక్షించడానికి, ఢీకొట్టే ప్రమాదాలను నివారించేందుకు 23 విన్యాసాలను నిర్వహించినట్లు తెలిపింది.