NTV Telugu Site icon

Champai Soren: బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ ఏమన్నారంటే..!

Champaisoren

Champaisoren

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన తాజాగా మీడియాతో స్పందించారు. ప్రస్తుతం ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందుతున్నాయో తనకు తెలియదన్నారు. అలాగే ఎలాంటి వార్తలు నడుస్తున్నాయో అసలు తెలియదన్నారు. అవి నిజమో కాదో చెప్పలేనని.. తాను ఎక్కడున్నానో అక్కడే ఉన్నానని వాటి గురించి తకేమీ తెలీదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Dil Raju: ఈ సినిమాకి నేను రివ్యూ రాస్తా.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అనంతరం హేమంత్‌కు బెయిల్ రావడం.. అనంతరం సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో చంపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ హేమంత్ కేబినెట్‌లో మంత్రిగా చంపై ప్రమాణస్వీకారం చేశారు. అయితే త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇటీవల బీజేపీ ఎంపీ దీపక్ ప్రకాశ్‌లో మాట్లాడుతూ.. చంపైనే అన్యాయంగా సీఎం పీఠం నుంచి తప్పించారని.. ఆయన చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. చంపై బీజేపీలో చేరే అంశం అధిష్టానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంపై బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు వినపడుతున్నాయి. తాజాగా ఆయన కొట్టిపారేశారు.

ఇది కూడా చదవండి: France air show video: ఎయిర్‌షోలో అపశృతి.. సముద్రంలో కూలిన జెట్ విమానం