Site icon NTV Telugu

సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం !

12వ తరగతి పరీక్షలు, జాతీయ స్థాయి ఎంట్రెన్స్ పై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులు, బోర్డ్ ల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంది కేంద్రం. 25వ తేదీ నుండి ఒకటి లోపు 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్.. విద్యార్థుల రక్షణ, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించాలి అనే యోచనలోనే కేంద్రం ఉందని తెలిపారు. అటు పరీక్షల పై తమ అభిప్రాయం చెప్పిన సీబీఎస్సీ… పరీక్ష సమయం మూడు గంటల నుండి 90 నిమిషాలకు తగ్గించాలని… ముఖ్యమైన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని సూచించినట్టు సమాచారం అందుతోంది. అంతే కాదు సొంత స్కూల్ లోనే విద్యార్థులకు పరీక్ష నిర్వహించాలని సూచించింది సీబీఎస్సీ.

Exit mobile version