Uber And Ola: ఇటీవల ఆండ్రాయిడ్, ఐఫోన్ ఫోన్లను బట్టి వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఓలా, ఉబర్‌పై ఆరోపణలు వచ్చాయి. రైడ్ బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ పరికరాల మోడళ్లను బట్టి వేర్వేరు ధరలు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. రెండు సంస్థలుకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ గురువాం నోటీసులు జారీ చేసింది.
Read Also: Delhi High Court: సె*క్స్‌కి మహిళ అంగీకరించిన మాత్రానా, ఆమె వీడియోలు తీయడం నేరమే..
కస్టమర్ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారా అనే దానిపై ఆధారపడి, రెండు కంపెనీలు ఒకే సేవకు వేర్వేరు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (CCPA) చర్య తీసుకుంది. తక్షణమే ఉబర్, ఓలా తన ధరల పద్ధతులను వివరించాలని, వివక్షతకు సంబంధించి ఆందోళనల్ని పరిస్కరించాలని కోరింది. ఈ పద్ధతిని స్పష్టంగా ధరలను ఉల్లంఘించడమే అని చెప్పింది. ఛార్జీల వసూలులో పారదర్శకత, న్యాయాన్ని నిర్ధారించడానికి వివరణాత్మక ప్రతిస్పందన కోరింది. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి, ఈ ధరల్ని వేర్వేరు మొబళ్లలో పోలుస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవడంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది.