Site icon NTV Telugu

Coronavirus: కరోనాపై కేంద్రం వార్నింగ్‌.. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు లేఖ

Coronavirus

Coronavirus

Coronavirus: కరోనా మరోసారి విజృంభించి అవకాశం ఉందా? అదే ఇప్పుడు ప్రభుత్వాన్ని టెన్షన్‌ పెడుతోంది.. ఈ మధ్య క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అలర్ట్‌ అయిన కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. కొత్త వేరియెంట్‌ రూపంలో దేశంలో మరోసారి కరోనా విజృంభించే అవకాశం కనిపిస్తోందనే ఆందోళన.. మరోవైపు ఫ్లూ కేసులు గణనీయంగా పెరుగుతోన్న నేపథ్యంలో.. ఆరు రాష్ట్రాలకు గురువారం లేఖలు రాసింది కేంద్ర ప్రభుత్వం..

Read Also: Virat Kohli : కోహ్లీకి చేరువలో మూడు రికార్డులు.. వన్డే సిరీస్ కి రెడీ.. ?

తెలంగాణ సహా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖలు రాశారు. కరోనా కేసులు పెరుగుతోన్న దృష్ట్యా.. మళ్లీ టెస్టుల సంఖ్యను పెంచాలని, చికిత్స, ట్రాకింగ్‌తో పాటు వ్యాక్సినేషన్‌ పై కూడా దృష్టిసారించాలని ఆ లేఖలో రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఇక, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.. కాబట్టి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొంది. గ్రామాలు, మండలాలు, జిల్లాలు నుంచే పర్యవేక్షణ కొనసాగించాలని.. మహమ్మారి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఇక, గురువారం నవీకరించబడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, నాలుగు నెలల విరామం తర్వాత ఒక రోజులో 700 కంటే ఎక్కువ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేసులు 4,623 కి చేరుకున్నాయి.

Exit mobile version