NTV Telugu Site icon

Medicine Prices: ఏప్రిల్ నుంచి మెడిసిన్ ధరల పెంపు అంతా ఉత్తదే.. కేంద్రం క్లారిటీ..

Medicine

Medicine

Medicine Prices: ఏప్రిల్ నెల నుంచి దేశంలో పలు రకాల మెడిసిన్స్‌పై ధరలు పెరుగుతాయని ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు హైలెట్ చేశాయి. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మీడియాలో మందుల ధరలపై వచ్చిన కథనాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. మెడిసిన్ ధరల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని చెప్పిన మీడియా నివేదికలను ‘‘తప్పుడు, తప్పుదోవ పట్టించేవి, హానికరమైనవి’’గా బుధవారం పేర్కొంది.

కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఔషధాల ధరలు 12శాతం చొప్పున పెరుగుతాయని నివేదించింది. ఇది 500 కంటే ఎక్కువ మందుల్ని ప్రభావితం చేస్తాయని తెలిపాయి. అయితే ఇదంతా ఉత్తదే అని, టోకు ధరల సూచి(WPI) ఆధారంగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) ఏటా షెడ్యూల్ చేసిన మందుల సీలింగ్ ధరలను సవరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ‘‘WPI పెరుగుదల 0.00551 శాతం ఆధారంగా, 782 ఔషధాల కోసం ప్రస్తుత సీలింగ్ ధరలలో ఎటువంటి మార్పు ఉండదు, అయితే 54 ఔషధాలపై రూ. 0.01 (ఒక పైసా) స్వల్ప పెరుగుదల ఉంటుంది’’ అని తెలిపింది.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 7న ఆప్ నిరాహార దీక్ష

ఈ 54 మెడిసిన్స్ సీలింగ్ ధర రూ. 90 నుంచి రూ. 261 వరకు ఉంటుంది. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్స్ (డిపిసిఓ) 2013 నిబంధనల ప్రకారం డబ్ల్యూపీఐ పెంపు అనుమతించదగిన గరిష్ట పెంపుదల అని, తయారీదారులు పెంపు తక్కువగా ఉండటంతో మందుల ధరల్ని పెంచొచ్చు, పెంచకపోవచ్చు అని మంత్రిత్వశాఖ తెలిపింది. అందువలన, FY 2024-25 సంవత్సరంలో, WPI ఆధారంగా ఔషధాల సీలింగ్ ధరలో దాదాపు ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది. తమ ఔషధాల సీలింగ్ ధరపై ఆధారపడి, కంపెనీలు తమ గరిష్ట రిటైల్ ధర (MRP)ని MRP (GST మినహాయించి) సీలింగ్ ధర కంటే తక్కువ ధరగా మార్చవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సవరించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని, ధరల వివవరాలు NPPA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ధరలు మార్చి 31, 2025 వరకు కొనసాగుతాయి.