Site icon NTV Telugu

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎస్‌పై చర్యలకు కేంద్రం నోటీసులు

Alapan Bandyopadhyay

Alapan Bandyopadhyay

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్రం మధ్య వార్ కొనసాగుతూనే ఉంది… ప్రధాని పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో మ్యాటర్ మరింత సీరియస్‌ అయ్యింది.. దీంతో.. వెంటనే ఢిల్లీలో రిపోర్ట్ చేయాలంటూ అప్పటి సీఎస్‌ అలపన్ బందోపాధ్యాయకు కేంద్రం ఆదేశాలు పంపింది.. ఆ దేశాలను ఆయన పట్టించుకోలేదు.. ఇక, ఆయనను సీఎస్‌ పదవికి రాజీనామా చేయించారు దీదీ.. అయితే, తాజాగా అల‌ప‌న్ బందోపాధ్యాయ‌పై అఖిల భార‌త సేవ‌ల (క్రమ‌శిక్షణ‌, అపీల్‌) నిబంధ‌న‌ల ప్రకారం క‌ఠిన జ‌రిమానా చ‌ర్యల‌కు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర సిబ్బంది, శిక్షణా మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు ఆయ‌న‌కు తెలియజేసింది. వ్యక్తిగ‌తంగా లేక లిఖిత పూర్వకంగా త‌న వాద‌న‌ను 30 రోజుల్లో తెలియ‌జేయాల‌ని పేర్కొంది. కానీ, స‌మాధానం రాకపోతే మాత్రం.. ఆయ‌న‌కు వ్యతిరేకంగా విచారణ జ‌రిపే అధికారం విచార‌ణ అధికారుల‌కు ఉంటుంద‌ని పేర్కొంది. మరి.. ఆయన దీనిపై స్పందిస్తారా..? స్పందిస్తే ఎలాంటి వివరణ ఇస్తారు? లేకపోతే.. ఎలాంటి చర్యలు ఉంటాయనేది వేచిచూడాలి.

Exit mobile version