OBC Row: రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పీఎం మోడీ వెనకబడిన వర్గాల్లో(ఓబీసీ)లో పట్టలేదని గురువారం రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒడిశాలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని తనను తాను ఓబీసీగా చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఓబీసీల్లో చేర్చిన ‘ఘంచీ’ కులానికి చెందిన కుటుంబంలో ఆయన ప్రధాని మోడీ జన్మించారని అన్నారు.
Read Also: Balagam Venu :నా బలగం నాన్న తప్ప అందరూ చూశారు.. వేణు ఎమోషనల్ పోస్ట్
ప్రధానిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రధాని మోడీ కులం ‘మోద్ ఘంచీ’ గుజరాత్ ప్రభుత్వ జాబితాలోని సామజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతి, ఓబీసీకి చెందిందని తెలిపింది. మండల్ కమీషన్ ఇండెక్స్ 9191(A) కింద OBCల జాబితాను తయారు చేసింది, ఇందులో మోద్ ఘంచి కులాన్ని చేర్చారు. గుజరాత్‌కు సంబంధించిన 105 OBC కులాలను భారత ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చిందని తెలిపింది.
1994 జూలై 25న గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సబ్-గ్రూపుని ఓబీసీ జాబితాలో చేర్చాలని నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని ప్రభుత్వం రాహుల్ గాంధీకి గుర్తు చేసింది. ఏప్రిల్ 4, 2000 నాటి భారత ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఇదే ఉప సమూహం ఓబీసీ జాబితాలో చేర్చబడిందని, ఈ రెండు నోటిఫికేషన్లు వచ్చిన సమయంలో నరేంద్రమోడీ అధికారంలో లేరని ప్రభుత్వం తెలిపింది.
