Terrorist Activities: జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్‌పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ.. దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందిస్తుందని కేంద్ర హోం శాఖ రిలీజ్ సిన నోటిఫికేషన్‌లో తెలిపింది.
Read Also: CM Revanth Reddy: నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..
ఇక, పలు సోషల్ మీడియా వేదికలు, రహస్య యాప్‌లు, స్పెషల్ మీటింగ్స్ ద్వారా యువతను ఈ గ్రూపులో చేర్చుకుంటోందని కేంద్ర హోంశాఖ చెప్పుకొచ్చింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే టార్గెట్ గా పెట్టుకుందని ఆరోపించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్–ఉత్– తహ్రీర్ భద్రతకు ముప్పుగా మారుతుందని హోం శాఖ పేర్కొనింది. అందుకే, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.