సంచార్ సాథీ యాప్‌పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. సంచార్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. యాప్ ద్వారా ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యతను తొంగిచూడడమేనని.. ఇదొక ‘‘పెగాసస్’’ అని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మండిపడ్డారు. ఈ యాప్ ద్వారా దేశంలోని ప్రజలందరిపై ప్రభుత్వం నిఘా పెట్టడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
ఎంపీ ఎన్.కే ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘సంచార్ సాథీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయినా ప్రతి వ్యక్తి మొబైల్ ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ఎందుకింత ఆసక్తి చూపుతోంది. రహస్యంగా ప్రజల సమాచారాన్ని సేకరించేందుకే. ఇది గోప్యతా హక్కును ఉల్లంఘించడమే. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు భంగం కల్పించడమే. వెంటనే కేంద్రం ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఉగ్రవాది డానిష్ ఫోన్‌లో మాస్టర్ ప్లాన్! ఉమర్‌ను ఎలా డైరెక్షన్ చేశాడంటే..!
సంచార్ సాథీ యాప్‌పై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంపై కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా స్పందించారు. ‘‘సంచార సాథి యాప్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఫోన్లలో సంచార్ సాథీ తప్పని సరి కాదు. సైబర్ మోసాలను నివారించేందుకు సంచార సాథీ యాప్ అవసరం. యాప్ వద్దనుకుంటే ఆన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యాక్టివేట్, డీ యాక్టివేట్ చేసుకోవడం అనేది వినియోగదారుల ఇష్టం’’ అని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: మోడీ అందుకే వరల్డ్ లీడర్ అయ్యారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
