మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మహారాష్ట్రలో నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మంగళవారం రోజున ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాసేపటికి మహద్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్‌ను మంజూరు చేశారు. అయితే, రాణేను 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వాలని రాణే తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న మహద్ కోర్టు, కేంద్ర మంత్రి రాణేకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈనెల 30, సెప్టెంబర్ 13వ తేదీన కోర్టుకు హాజరుకావాలని మంత్రిని ఆదేశించింది.
కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బెయిల్…
