Site icon NTV Telugu

జ‌మ్మూకశ్మీర్‌పై కేంద్ర హోంశాఖ కీల‌క వ్యాఖ్య‌లు…

జ‌మ్మూకశ్మీర్ ప్రస్తుతం యూనియ‌న్ టెరిట‌రీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  అయితే, ఈ ప‌రిస్థితి కొంత‌కాలం మాత్ర‌మే ఉంటుందని, త‌ప్ప‌కుండా జ‌మ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర‌హోదా క‌ల్పిస్తామ‌ని గ‌తంలో ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి నేత‌ల‌కు హామీ ఇచ్చారు.  అయితే, రాష్ట్రంలో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌రువాత రాష్ట్ర‌హోదాను ఇస్తామ‌ని చెప్పారు.  దీనిపై మ‌రోసారి రాజ్య‌స‌భ‌లో కేంద్ర‌హోంశాఖ రాత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చింది.  స‌రైన స‌మ‌యంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామ‌ని అన్నారు.  సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న త‌రువాత ఆ దిశ‌గా ఆలోచిస్తామ‌ని, భ‌ద్ర‌త ప్ర‌యోజ‌నాల దృష్ట్యా క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ల‌పై తాత్కాలిక ప‌రిమితులను విధించామ‌ని, ఆయ‌న పేర్కొన్నారు.  అయితే, ఈ ప‌రిమితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ, అవ‌స‌ర‌మైన చోట స‌డ‌లింపులు కూడా చేస్తామ‌ని నిత్యానంద రాయ్ స్ప‌ష్టం చేశారు.  

Read: ‘బధాయ్ హో’ తమిళ రీమేక్ అప్ డేట్స్!

Exit mobile version