సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించింది. ఇకపై గ్యాస్ సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో సామాన్యులు మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కరోనా తర్వాత సామాన్యులకు అంతంత మాత్రంగానే గ్యాస్ సబ్సిడీ పడుతోంది. ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయడంతో గ్యాస్ సిలిండర్ ధర సామాన్యులకు భారంగా మారనుంది.
Facebook: ఫేస్ బుక్ కు షాక్.. ఉద్యోగాన్ని వీడుతున్న కీలక ఉద్యోగి
కాగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీని బ్యాంకు ఖాతాలలో జమ చేసేది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల పథకం కింద వినియోగదారులు ఉన్నారు. మిగిలిన 21 కోట్ల మందికి ఇకపై గ్యాస్ సబ్సిడీ రాదు. 2010లో పెట్రోల్‌పై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. 2014 నవంబర్‌లో డీజిల్‌పై ఉన్న సబ్సిడీని కూడా తొలగించింది. అంతకు ముందు కిరోసిన్‌పై ఉన్న సబ్సిడీని కూడా నిలిపివేసింది. తాజాగా గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1,055గా ఉంది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,220.50గా పలుకుతోంది.