NTV Telugu Site icon

CJI Justice DY Chandrachud: సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌.. కేంద్రం ఆమోదం..

Justice Dy Chandrachud

Justice Dy Chandrachud

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ నియమితులు అయ్యారు.. ఇటీవలే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లలిత్‌… జస్టిస్‌ చంద్రచూడ్‌ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు జస్టిస్‌ చంద్రచూడ్‌ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది… ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోషల్‌ మీడియాలో వెల్లడించారు.. దీంతో, నవంబర్‌ 9న జస్టిస్‌ చంద్రచూడ్‌ సుప్రీంకోర్టు 50వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.. రెండేళ్ల పాటు ఆయన పదవీ కొనసాగి.. 2024, నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్నారు.. సీజేఐగా జస్టిస్‌ లలిత్‌ పదవీ కాలం నవంబర్‌ 8వ తేదీతో ముగియనున్నది.

Read Also: Kanipakam: కాణిపాకంలో కలకలం.. భార్య కోరిక మేరకు మద్యం మానేయడానికి వచ్చి..!

కాగా, జస్టిస్‌ చంద్రచూడ్‌.. అనేక కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు.. సుప్రీంకోర్టుకు అత్యధిక కాలం సీజేఐగా పనిచేసిన జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ (1978-1985) కుమారుడే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌…. మహారాష్ట్రలో 1959, నవంబర్‌ 11న జన్మించిన ఆయన.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో రెండు అడ్వాన్స్‌డ్‌ డిగ్రీలు పొందిన వ్యక్తి.. ఇక, బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన చంద్రచూడ్‌.. 39 ఏళ్లకే బాంబే హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది అయ్యారు. 1998లో భారత అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా సేవలు అందించారు. 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013-16 మధ్య అలహాబాద్‌ హైకోర్టు సీజేగా పనిచేశారు. 2016, మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన జర్నీ కొనసాగింది.. అయోధ్య భూవివాదం, గోపత్య హక్కు సహా పలు కీలక కేసులపై తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్నారు.. సీజేఐలుగా పనిచేసిన తండ్రి, కొడుకులుగా జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు..