Site icon NTV Telugu

రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

దేశంలో రూ.10 నాణేలు వాడుకలో ఉన్నా వ్యాపారులు వీటిని స్వీకరించడంలేదు. దీంతో ఈ నాణేలను కలిగి ఉన్న వారు గందరగోళానికి గురవుతున్నారు. ఏదైనా కొనుగోలు నిమిత్తం రూ.10 నాణేలను తీసుకువెళ్తే వ్యాపారులు తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రూ.10 నాణేల అంశం మంగళవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. రూ.10 నాణేం చెల్లుతుందా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు ఎంపీ ప్రశ్నించారు.

Read Also: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నోట ‘పుష్ప’ డైలాగ్

ఈ సందర్భంగా రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రూ.10 నాణేలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించి చలామణిలో ఉంచిందని చెప్పారు. అన్ని లావాదేవీలకు ప్రజలు ఈ నాణేలను వాడుకోవచ్చని సూచించారు. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. ఎవరైనా రూ.10 నాణేలను స్వీకరించకపోతే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Exit mobile version