Site icon NTV Telugu

ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగింపు

దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం పొలిటికల్ ర్యాలీలు, రోడ్ షోలపై గతంలో నిషేధం విధించింది. తాజా ఆ నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలిదశలో ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఈ నెల 28 తర్వాత బహిరంగ సభలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రెండో దశ ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి సభలు నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది.

Read Also: వీకెండ్ లాక్‌డౌన్ ఎత్తివేత.. ఇక‌, య‌థావిథిగా స్కూళ్లు

కొన్ని నిబంధనలతో రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇంటింటి ప్రచారానికి ఇప్పటివరకు గరిష్టంగా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 10కి పెంచింది. కరోనా నిబంధనలనేు పాటిస్తూ వీడియో ప్రచార రథాలను రంగంలోకి దింపుకోవచ్చని ఈసీ పేర్కొంది. కాగా ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు వివిధ దశల్లో పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Exit mobile version