Site icon NTV Telugu

Armed Forces: భారత త్రివిధ దళాల్లో 1.35లక్షల ఖాళీలు.. వెల్లడించిన కేంద్రం

Armed Forces

Armed Forces

Armed Forces: భారత త్రివిధ దళాల్లో ఉన్న ఖాళీలను కేంద్రం ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలి ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నేవీలో 13,537, ఎయిర్‌ఫోర్స్‌లో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏటా సగటున భర్తీలు 60 వేలు, 5332, 5723గా ఉన్నట్లు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ మంగళవారం తెలిపారు. రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

సగటు నియామకాల సంఖ్య.. అగ్నివీరుల భర్తీ సంఖ్య కంటే ఎక్కువగా ఉందా? అలా అయితే, సాయుధ దళాల్లో సిబ్బంది కొరతను ఎలా తీరుస్తారు?.. అనే నిర్దిష్ట ప్రశ్నకు మంత్రి నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని బదులిచ్చారు. ఆఫీసర్, నాన్-ఆఫీసర్ ర్యాంక్ సిబ్బందితో సహా మొత్తం త్రివిధ దళాల్లో సిబ్బంది కొరతపై భట్ వివరణ ఇచ్చారు. ఆఫీసర్ మరియు నాన్-ఆఫీసర్ ర్యాంక్ సిబ్బందితో సహా మొత్తం మూడు సాయుధ దళాలలో మొత్తం సిబ్బంది కొరతపై భట్ మాట్లాడుతూ.. జనవరి 1 నాటికి అధికారిక బలంతో పోలిస్తే సైన్యంలో 1,16,464 మంది కొరత ఉందని చెప్పారు. జనవరి 1, 2020 నాటికి సైన్యంలో 64,482 మంది సిబ్బంది కొరత ఉందన్నారు. మే 31 నాటికి నావికాదళంలో 13,597 మంది కొరత ఉండగా.. జూలై 1 నాటికి భారత వైమానిక దళంలో 5,723 మంది ఉన్నారు.

Air Guns : లక్నో ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ గన్స్ కలకలం

ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘అగ్నిపథ్‌’ పేరిట కొత్త రిక్రూట్‌మెంట్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద.. త్రివిధ దళాలు ఈ ఏడాది 46 వేల మంది అగ్నివీరులను నియమించుకోనున్నాయి. ఇప్పటికే రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించాయి. గత నెలలో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. ఉద్యోగ హామీని అందించనందున దానిని వెనక్కి తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Exit mobile version