Ceiling Fan Falls on Woman Judge: కోర్టులో విచారణ సమయంలో మహిళా జడ్జీపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. తీవ్ర గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ceiling Fan Falls on Woman Judge: ఓ కేసు విచారణ కొనసాగుతోన్న సమయంలో మహిళా న్యాయమూర్తిపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన ఘటన కలకలం రేపింది.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా కోర్టులో.. సోమవారం ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోర్టులో విచారణ జరుగుతుండగా, పనిచేస్తున్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడిపడి మహిళా అదనపు సెషన్స్ జడ్జిపై పడింది. ఈ ఘటనతో కోర్టు గదిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కోర్టు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతుండగా అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. అదే సమయంలో పైకప్పుకు అమర్చిన సీలింగ్ ఫ్యాన్ విరిగి నేరుగా జడ్జి కూర్చున్న కుర్చీపై పడింది. ఈ ప్రమాదంలో మహిళా న్యాయమూర్తి తలకు, భుజానికి గాయాలయ్యాయి.
ఇక, గాయపడిన న్యాయమూర్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కోర్టు ప్రాంగణంలో పనిచేస్తున్న న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్ఎల్ యాదవ్ మరియు న్యాయవాది వినోద్.. కోర్టు భవనం శిథిలావస్థలో ఉందని ఆరోపించారు. కోర్టు గదులలోని విద్యుత్ అమరికలు, వైరింగ్ చాలా సంవత్సరాల నాటివి. పైకప్పులు కారడం, నిర్మాణం బలహీనపడటం వంటి సమస్యలపై ఇప్పటికే పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారులు కేవలం తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారని తెలిపారు.
Also Read
- Gallantry Awards 2026: వీర సైనికులకు గొప్ప గౌరవం.. శౌర్య, కీర్తి చక్ర సహా 78 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం
- Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
ఈ ఘటన తర్వాత కోర్టు భవనం భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భవనాన్ని పూర్తిగా పునర్నిర్మించకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు హెచ్చరించారు. అందువల్ల త్వరలోనే కొత్త కోర్టు భవనాన్ని నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న భవనానికి తక్షణమే పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!