షెడ్యూల్ ప్రకారం జులై చివరి వారంలో 10, 12 తరగతుల ఫలితాలను ప్రకటిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం తెలియజేసింది. బోర్డు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు జూలై చివరి వారంలో ప్రకటించబడతాయని.. బోర్డు ఫలితాల్లో ఎటువంటి ఆలస్యం ఉండదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
గత రెండేళ్లతో పోల్చితే, సీబీఎస్ఈ ఈ ఏడాది పరీక్షలను ఆలస్యంగా ప్రారంభించి.. 50 రోజులకు పైగా నిర్వహించింది. కొవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ ముందుగానే ఫలితాలను ప్రకటించబోతున్నట్లు ఓ అధికారి తెలిపారు. విద్యార్థులు ఫలితాలు ప్రకటించే తేదీ గురించి వచ్చే వదంతులను పట్టించుకోవద్దన్నారు. సీబీఎస్‌ఈ ఫలితాల ఆధారంగా అన్ని సంస్థలు విద్యార్థుల అడ్మిషన్లను చేపడతాయని అధికారి తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించి సీబీఎస్‌ఈ అన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు.
Group-1: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌పై పిటిషన్.. నేడు హైకోర్టులో విచారణ..
కాగా 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు దేశ వ్యాప్తంగా 75 సబ్జెక్టులకు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 21 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ప్రాక్టికల్స్, థియరీలతో కలిపి 33 శాతం, ఆపైన మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా బోర్డు ప్రకటిస్తుంది. సీబీఎస్సీ 12వ తరగతి టర్మ్ 2 పరీక్షలకు దాదాపు 3,50,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారా.. అని విద్యార్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్‌డేట్ల కోసం వెబ్‌సైట్ cbse.gov.in లేదా cbseresults.nic.in.ను తనిఖీ చేయవల్సిందిగా అధికారిక వర్గాలు తెలిపాయి.
