NTV Telugu Site icon

బ్యాంకు రుణాల ఎగవేత.. 14 చోట్ల సీబీఐ సోదాలు

Yes Bank

Yes Bank

బ్యాంక్ రుణాల ఎగవేత కేసుల్లో దేశవ్యాప్తంగా 14 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.. ఢిల్లీ, గుర్‌గావ్‌తో పాటు హైదరాబాద్‌లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. యెస్ బ్యాంక్ నుంచి 466 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టిన ఓయిస్టర్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్, అవంత రియాల్టీ లిమిటెడ్ కంపెనీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆ రెండు కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. నకిలీ పత్రాలతో పొందిన రుణాలను పక్కదారి పట్టించినట్లు అనుమానాలు ఆ రెండు కంపెనీల పైనా ఆరోపణలు ఉన్నాయి.