Site icon NTV Telugu

Cars24 Layoffs: ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన కార్స్24..

Cars24 Layoffs

Cars24 Layoffs

Cars24 Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, మాంద్యం భయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం వల్ల టెక్ రంగంలో ఉద్యోగాలు ఊడుతునున్నాయి. గత రెండేళ్ల నుంచి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో పాటు దేశీయ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. ఉన్నపళంగా ఉద్యోగులకు ‘‘లేఆఫ్స్’’ ప్రకటిస్తున్నాయి.

తాజాగా, యూజ్డ్ కార్లను విక్రయించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ Cars24, దాదాపు 200 నుండి 250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఖర్చుల్ని తగ్గించే చర్యల్లో, భవిష్యత్ నియామక ప్లాన్‌లో భాగంగా కార్స్ 24 ఈ తొలగింపుల్ని అమలు చేయబోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సెకండ్ హ్యండ్ కార్ల కోసం పనిచేస్తున్న ఈ -కామర్స్ ప్లాట్‌ఫామ్ ఈ నెలలో తన పోడక్ట్ అండ్ స్ట్రాటజీ టీమ్స్ నుంచి 250 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలిసింది.

Read Also: Uttam Kumar Reddy : తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. ఏడాదిన్నర కృషి ఫలించింది

నివేదిక ప్రకారం, కార్స్ 24 ప్రత్యర్థి స్పిన్నీ యాక్సెల్ లీడర్‌షిప్ ఫండ్ నుండి USD 131 మిలియన్ల తాజా నిధులను పొందిన ఈ సమయంలో కార్స్ 24 ఈ తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. స్పిన్నీ కార్స్ ఈ నిధులతో ప్రపంచవ్యాప్తంగా సెలక్షన్ అండ్ పోర్ట్‌ఫోలియోని డబుల్ చేద్ధామని చూస్తోంది. కార్స్24 CEO విక్రమ్ చోప్రా మాట్లాడుతూ, తొలగింపు నిర్ణయం కఠినమైనదని మరియు ఇది వివిధ విధుల్లో 200 మందికి పైగా ఉద్యోగులను ప్రభావితం చేసిందని ధృవీకరించారు.

Exit mobile version