Work-Week Debate: ఇటీవల కాలంలో ‘‘పని గంటల’’పై పలువురు కంపెనీల అధినేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వీరి వ్యాఖ్యలపై ఇతర పారిశ్రామికవేత్తలు కూడా పెదవి విరిచారు. పని గంటల కన్నా ప్రొడక్టివిటీ ముఖ్యమని హితవు పలికారు.
Read Also: V.Hanumantha Rao: ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత..
తాజాగా, ఈ పనిగంటల చర్చలోకి ప్రముఖ ఐటీ సంస్థ కాప్‌జెమిని ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది కూడా కాలుమోపారు. మంగళవారం ఆయన నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరం (ఎన్‌టిఎల్‌ఎఫ్)లో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. వారానికి 47.5 గంటల పనిని సమర్థించారు. వారాంతాల్లో ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడాన్ని వ్యతిరేకించారు. ‘‘గత నాలుగేళ్లుగా నా మార్గదర్శక సూత్రం ఏమిటంటే, వీక్ ఎండ్స్‌లో సమస్య తీవ్రతరం అయినప్పటికీ, మీరు దాన్ని పరిష్కరించగలరని మీకు తెలిసినా వీకెండ్స్‌లో ఈమెయిల్స్ పంపవద్దు’’ అని అన్నారు. కొన్నిసార్లు తాను వారాంతాల్లో పనిచేస్తానని చెబుతూనే, వారాంతంలో పని చేయలేమని తెలిసిన ఉద్యోగికి బాధను కలిగించడంలో అర్థం లేదని, కాబట్టి తాను ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపడం మానేస్తానని యార్ది చెప్పారు.
దీనికి ముందు ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటల పని చేయాలని ఉద్యోగుల్ని కోరారు. ఎల్ అండ్ టీ సుబ్రహ్మణ్యన్ వారానికి 90గంటలు పనిచేయాలని పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది.