NTV Telugu Site icon

Central Cabinet Decisions: నేషనల్ క్రిటికల్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం.. ఎన్ని కోట్లు కేటాయించారంటే..!

Centralcabinetdecisions

Centralcabinetdecisions

నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం రూ.16,300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం కేంద్ర కేబినెట్ వివరాలను అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రూ.16,300 కోట్ల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Bandi Sanjay : సీఎం హామీలు అమలు కాలేదంటే… ముఖ్యమంత్రి పదవికే కళంకం

అలాగే సీ-హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్ కోసం అధిక ఎక్స్-మిల్ ధరను కేంద్రం ఆమోదించినట్లు తెలిపారు. సీ హెవీ మొలాసిస్‌తో ఉత్పత్తి చేసే ఇథనాల్‌ ఎక్స్‌మిల్‌ ధర గతంలో లీటరుకు రూ.56.28 ఉండగా.. తాజాగా రూ.57.97కి పెంచుతూ కేబినెట్ ఆమోదించిందని కేంద్రమంత్రి ప్రకటించారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు ఆఫ్‌షోర్ మైనింగ్ వేలాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పని చేస్తుందని కేంద్రం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Delhi Elections: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. మహిళలపై వరాలు