బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్‌లో ప్రస్తావించినట్టుగానే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాడ్‌బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.30,600 కోట్ల గ్యారెంటీ ఇస్తోందని ప్రకటించారామె.. బ్యాంకింగ్‌రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నామన్న నిర్మలా సీతారామన్.. ఇప్పుడిప్పుడే బ్యాంకింగ్ రంగం కోలుకుంటుందన్నారు.. ఇక, ఎన్‌పీఏలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు నిర్మలా సీతారామన్.. 2018 నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశామని చెప్పుకొచ్చారు.. బ్యాంకులు సొంతంగా మూలధనాన్ని సమకూర్చుకునే స్థాయికి వచ్చాయని వ్యాఖ్యానించారు.
నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌సీఎల్).. ముద్దుగా బ్యాడ్ బ్యాంకుగా పిలుస్తున్నారు.. ఈ బ్యాంక్ జారీ చేసే సెక్యూరిటీ రసీదుల కోసం రూ.30,600 కోట్ల వరకు ప్రభుత్వ గ్యారెంటీని ఆమోదించినట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్.. ఈ హామీ ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. తొలి దశలో ఎన్‌ఆర్‌సీఎల్‌కు బదిలీ చేసే రూ.89,000 కోట్ల 22 బ్యాండ్ లోన్ ఖాతాలను బ్యాంకులు గుర్తించాయి. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ రూ.500 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన ఆస్తులను మాత్రమే పరిష్కరించేందుకు తీసుకోనుంది. కాగా, ఈ బ్యాడ్ బ్యాంకులో లీడ్ స్పాన్సర్‌గా 12 శాతం స్టేక్‌తో కెనరా బ్యాంకు వ్యవహరించనుంది.. ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని కలిసి ఎన్‌ఆర్‌సీఎల్‌లో 51 శాతంను కలిగి ఉంటాయి..
