Bridge Collapses: కొన్ని బ్రిడ్జ్‌లు ఏళ్లు గడిచినా.. చెక్కు చెదరకుండా ఉంటాయి.. మరికొన్ని కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకుండానే కుప్పకూలిన సందర్భాలు ఉంటాయి.. అలాంటి ఘటనే ఇప్పుడు బీహార్‌లో జరిగింది.. బెగుసరాయ్‌లో గండక్ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన… నిన్న కుప్పకూలింది. బ్రిడ్డ్ ముందు భాగం కూలి నదిలో పడిపోయింది.. అయితే, ఆ బ్రిడ్జి ఇంకా ప్రారంభించలేదు.. ముందే ఇలా జరగడంతో అంతా షాక్ తిన్నారు.. అయితే, అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత టోల చౌకి, బిషన్‌పూర్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.. 2016లో పనులు ప్రారంభించి 2017లో నిర్మాణాన్ని పూర్తి చేశారు.. దీని కోసం రూ.13 కోట్లు ఖర్చు చేశారు.. కానీ, అనుసంధాన రోడ్డు లేకపోవడంతో బ్రిడ్జి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అయితే, కొద్ది రోజుల క్రితమే బ్రిడ్జి ముందు భాగంలో పగుళ్లను గుర్తించారు.. దీనిపై ఈ నెలలోనే అధికారులకు కూడా వెళ్లాయి.. బ్రిడ్జికి రిపేర్ల దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకముందే.. ముందు భాగం కుప్పకూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. మరోవైపు.. గత నెల, బీహార్‌లోని నలంద జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒక కార్మికుడు మృతిచెందగా.. మరో వ్యక్తి గాయపడిన విషయం తెలిసిందే.. ఈ మధ్యేనే బీహార్‌లో బ్రిడ్జి కూలిపోవడం ఇది రెండో ఘటన కావడం చర్చగా మారింది.
Read Also: Tension at Midthur Police Station: మిడుతూరులో ఉద్రిక్తత.. పీఎస్‌పై దాడి..! 14 మందిపై కేసు