Short Hair: మరికొద్ది క్షణాల్లో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. ఇంతలోనే వరుడు మాటలు అందరిని షాక్ కి గురిచేశాయి. పెళ్లిలో వధువు జుట్టు చూసి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు వరుడు. ఈ సీన్ అచ్చం మట్టికుస్తీ సినిమాను తలపించింది. అంటే ఆ సినిమాలో పెళ్లి చూపులకు వెళ్లి అమ్మాయి జుట్టు చిన్నగా ఉందని నో అని చెప్తాడు హీరో. కానీ ఇక్కడ పెళ్లిలోనే వరుడు వధువు జుట్టు చిన్నగా ఉందని పెళ్లినే క్యాన్సల్ చేయడం సంచలనంగా మారింది. అయితే వధువు కుటుంబసభ్యులు మాత్రం అదనపు కట్నం కోసమే వరుడు పెళ్లికి నో చెప్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలు ఇలా..
అయోధ్యలోని బికాపుర్ ప్రాంతంలో మరి కొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువుకు జుట్టు తక్కువగా ఉందని వరుడు పెళ్లికి నిరాకరించాడు. పెళ్లి ఊరేగింపు జమోలి నుంచి బికాపుర్ గ్రామానికి వచ్చింది. కాగా.. అదే సమయంలో వరుడికి తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తలపై జుట్టు తక్కువగా ఉందన్న విషయం తెలిసింది. ఇంతలోనే ఆగ్రహానికి గురైన వరుడు క్షణం ఆలస్యం చేయకుండా.. తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు. అక్కడు వెళ్లిన వరుడు అమ్మాయి జుట్టును చూడాలని అడిగాడు. ఆశ్చర్య పోయిన వధువు తల్లిదండ్రులు వధువును చూపించారు. అయితే.. వధువు తలపై జుట్టు తక్కువగా ఉండటం చూసిన వరుడు పెళ్లి చేసుకోనంటూ వెనుతిరిగాడు. అంతే అక్కడ ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. అయితే.. రాత్రంతా ఇరు కుటుంబ సభ్యులు పంచాయితీ జరిపినా.. పెళ్లికొడుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోనని నిర్మొహమాటంగా చెప్పేశాడు. అయితే దీనిపై వధువు సోదరి మాట్లాడుతూ.. పెళ్లికి ముందే అన్ని విషయాలు వరుడికి, అతడి కుటుంబ సభ్యులకు వివరించినట్లు వెల్లడించింది. అయితనా వరుడు, కుటుంబ సభ్యులు మరింత కట్నం కోసం డిమాండ్ చేశారని దానికి తాము ఓప్పుకోకపోవడం వల్లే పెళ్లికి నో చెప్పిన్నట్లు ఆరోపించారు. దీనిపై రాత్రంతా పంచాయితీ జరిగినా ఓ కొలిక్కి రాకపోవడం వల్ల ఇరువర్గాలు బికాపుర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. దీంతో.. అదనపు కట్నం కోసమే వరుడి కుటుంబం పెళ్లికి నిరాకరించారని, వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో.. పోలీసులు వరుడు, అతడి తండ్రి సహా మరో 9 మంది బంధువులపై కేసు నమెదు చేశారు. అయితే.. దీనిపై పూర్తి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Marriage In Hospita: మండపానికి రాలేనిస్థితిలో పెళ్లి కూతురు.. ఆసుపత్రికే వెళ్లి తాళికట్టిన వరుడు