NTV Telugu Site icon

వ‌రుడి చెంప చెల్లుమ‌నిపించిన వ‌ధువు.. కుటుంబ స‌భ్యుల‌పై గ్రామ‌స్తుల దాడి..!

marriage

పెళ్లి జ‌రుగుతుందంటే.. వ‌రుడికి.. వ‌ధువు చాలా మ‌ర్యాద ఇవ్వాలి.. ఇక, పెళ్లి అయిపోయిన కొత్త‌లో అయితే.. సిగ్గు, బియ‌డం లాంటివి సినిమాల్లో చూస్తుంటాం.. కొన్ని సినిమాలు వేరుగాఉంటాయి.. అయితే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పెళ్లి జ‌రిగింది.. ఆ వెంట‌నే రిసెప్ష‌న్‌కు ఏర్పాట్లు చేశారు.. కాసేప‌ట్లో అదికూడా ప్రారంభం కావాల్సి ఉంది.. కానీ, అక్క‌డే ఒక చిక్కు వ‌చ్చిప‌డింది.. కొత్త మెలిక పెట్టాడు పెళ్లి కుమారుడు.. దానికి వ‌ధువు కుటుంబం త‌మ‌కు స్తోమ‌త లేదంటూ ఒప్పుకోలేదు.. మ‌రోవైపు ఆ యువ‌కుడు మొండికేశాడు.. ఈ తంతంగాన్ని అంతా ప‌క్క‌నే ఉండి గ‌మ‌నిస్తున్న పెళ్లికూతురుకు కోపం క‌ట్ట‌లు తెచ్చుకుంది.. పెళ్లి మండపంపైనే అతడిని ప‌ట్టుకు చెంప‌లువాయ‌కొట్టింది..

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా సలీమ్‌పూర్‌లో నాసిమ్‌ అహ్మద్ అనే వ్య‌క్తి కుమార్తెకు మహమ్మద్‌ ఇమ్రాన్‌ సాజ్‌తో ఈనెల 17వ తేదీన పెళ్లి చేశారు.. ఇక‌, బ‌రాత్ కార్య‌క్ర‌మం కూడా ధూంధాంగానే జ‌రిగింది.. ఆ త‌ర్వాత రిసెప్ష‌న్ కు ఏర్పాట్లు చేశారు.. కానీ, పెళ్లికూతురు, పెళ్లి కొడుకు ముస్తాబ‌య్యారు.. కార్య‌క్ర‌మం ప్రారంభం అయ్యే స‌మ‌యానికి త‌న‌కు వరకట్నం కింద తనకు బుల్లెట్ కావాలంటూ వ‌రుడు ప‌ట్టుబ‌ట్టాడు.. వధువు కుటుంబసభ్యులు ఎంత బ‌తిమిలాడినా.. విన‌లేదు.. ఇది కాస్త పెద్ద‌గా మారిపోయి.. ఇరు కుటుంబాల మ‌ధ్య వివాదంగా మారింది.. దీంతో.. తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోయిన వ‌ధువు.. వరుడి వద్దకు వెళ్లి చెంప చెల్లుమ‌నిపించింది.. రెండు, మూడుసార్లు చెంప‌లు గ‌ట్టిగానే వాయించింది.. ఇక‌, వ‌ధువు కుటుంబానికి మ‌ద్ద‌తుగా ఆ గ్రామ‌స్తులు.. వ‌రుడి కుటుంబ‌స‌భ్యులు, బంధువుల‌పై దాడికి దిగారు.. ఇలా చిలికిచిలికి గాలివాన‌గా మారిపోయింది వ్య‌వ‌హారం.. పోలీసుల జోక్యం చేసుకుని న‌చ్చ‌జెప్పాల‌ని చూసినా వ‌రుడు వినిపించుకోలేదు. త‌న‌కు విడాకులు కావాల్సిందేన‌ని మొండికేయ‌డంతో.. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.