Site icon NTV Telugu

Akash system: ఆపరేషన్ సిందూర్‌లో పాక్ క్షిపణుల్ని దెబ్బతీసిన “ఆకాష్ సిస్టమ్‌”పై బ్రెజిల్ కన్ను..

Aakash

Aakash

Akash system: భారతదేశ రక్షణ పరిశ్రమ ప్రతీ ఏడాది అభివృద్ధిని నమోదు చేస్తోంది. భారత ఆయుధ ఎగుమతులు కూడా గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ఆయుధ మార్కెట్‌లోకి భారత్ నెమ్మదిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తయారు చేసిన పలు ఆయుధ వ్యవస్థలను కొనేందుకు ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల, పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత ఆయుధ వ్యవస్థలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేశాయి. మన ఆయుధ వ్యవస్థల ముందు చైనా తయారీ మిస్సైళ్లు కూడా తట్టుకోలేకపోయాయి. పాకిస్తాన్ ప్రయోగించి డ్రోన్లు, క్షిపణనును సమర్థవంతంగా అడ్డుకున్నాయి.

ముఖ్యంగా, స్వదేశీ తయారీ ‘‘ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్’’ అత్యద్భుతంగా పనిచేసింది. దీంతో ఈ ఆకాష్ సిస్టమ్‌ని కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ ఆసక్తి చూపిస్తుంది. ఆకాష్ వ్యవస్థతో పాటు, స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాముల వంటి భారత్‌లో తయారు చేయబడిన సైనిక హార్డ్‌వేర్‌పై బ్రెజిల్ కన్నేసింది.

Read Also: IND vs ENG: ఎంతకు తెగించార్రా.. గిల్‌ను అవుట్‌ చేయలేక ఇలాంటి సిల్లీ ఐడియాస్ ఏంటో..!

ఈ వారం చివరల్లో బ్రెజిల్‌లో జరగబోయే బ్రిక్స్ సమ్మిట్‌కి ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశానికి వెళ్లారు. దీంతో వీటి కొనుగోలుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోదీ జూలై 5 నుండి 8 వరకు రియో ​​డి జనీరోలో జరిగే 17వ బ్రిక్స్ సమ్మిట్ కోసం బ్రెజిల్ సహా ఐదు దేశాల పర్యటనకు బయలుదేరారు, అర్జెంటీనాతో సహా మరికొన్ని దేశాల్లో ఆయన పర్యటిస్తు్న్నారు. రక్షణ సహకారం, ఉమ్మడి పరిశోధన, ట్రైనింగ్‌పై బ్రెజిల్, భారత్ చర్చించనున్నాయి.

‘‘బ్రెజిల్ వార్ ఫీల్డ్‌లో సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌకలు, స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్స్ నిర్వహించడానికి భాగస్వామ్య, ఆకాష్ వ్యవస్థ, తీర ప్రాంత నిఘా వ్యవస్థ, గరుడ ఫిరంగి తుపాకులపై ఆసక్తి కలిగి ఉన్నారు’’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (తూర్పు) పి కుమారన్ వెల్లడించారు.

భారత్ ఏఐ-ఆధారిత ఆకాష్‌తీర్ వ్యవస్థలో అంతర్భాగమైన ఆకాష్ సిస్టమ్, భారతదేశ ఇంటిగ్రేటెడ్ కౌంటర్-UAS గ్రిడ్ (IACCS) మరియు వాయు రక్షణ వ్యవస్థలు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వైమానిక ముప్పును 100 శాతం ఖచ్చితత్వంతో అడ్డుకున్నాయి. ఆకాష్ 25 కి.మీ పరిధిలో కలిగిన మధ్యస్థ శ్రేణి, సర్ఫేజ్ టూ ఎయిర్ మిస్సైల్. ఇది సూపర్ సోనిక్ వేగంతో విమానాలు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకుంటుంది. బ్రెజిల్ సహా ఆర్మేనియా వంటి మరికొన్ని దేశాలు భారత్ ఆయుధాలను నమ్ముతున్నాయి.

Exit mobile version