Site icon NTV Telugu

Dog Saves Owner: పాము నుంచి యజమానిని కాపాడిన కుక్క

Dog Saves Owner

Dog Saves Owner

మనుషుల కన్నా కూడా కుక్కలు ఎక్కువ విశ్వాసం చూపిస్తాయి. అలా కుక్కలు విశ్వాసం చూపించిన కథలు మీరు చాలా విని ఉంటారు. కుక్కలకు ఒక్క పూజ భోజనం పెట్టినా చాలు యజమానిపై అమితమైన ప్రేమ చూపిస్తాయి. ఇంటికి కాపలా కాస్తాయి. దొంగలు రాకుండా చూసుకుంటాయి. కానీ.. తాజాగా ఓ కుక్క తమ యజమానినిన విష సర్పం నుంచి కాపాడింది. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. సౌతాఫ్రికాలో ఒక కుక్క మంచం క్రింత దాక్కున్న ప్రమాదకరమైన మాంబా పాము నుంచి దాని ఓనర్ ను రక్షించడంలో తన ధైర్యాన్ని ప్రదర్శిచింది.

Aslo Read : Silicon Valley Bank: సిలికాన్ వ్యాలీపై ఎలాన్ మస్క్ ఫోకస్.. బ్యాంక్‌ కొనుగోలుకు ఆసక్తి

యజమాని మంచం దగ్గరకు వచ్చిన ప్రతీసారీ కుక్క గట్టిగా అరిచేదట.. కుక్క ప్రతీసారీ ఎందుకు అరుస్తోందా అని అతను మంచం కింత చూడగా.. పెద్ద విస సర్పం బ్లాక్ మాంబా పాము కనిపించడం గమనార్హం. దక్షిణాఫ్రికాకు చెందిన నిక్ ఎవాక్స్ అనే పాములు పట్టేవాడు ఈ భయానక విషయాన్ని ఫేస్ బుక్ లో పంచుకున్నాడు. తర్వాత పాముని పట్టుకున్న విషయాన్ని కూడా అతను ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ గా మారింది. యజమానిపై కుక్క చూపించిన విశ్వాసానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Aslo Read : Chiru: బలగం సినిమా చిత్ర యూనిట్ కి ‘చిరు’ సన్మానం…

Exit mobile version