Parliament Session: లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై శుక్రవారం చర్చ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో, సుధాన్షు త్రివేది రాజ్యసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ‘నీట్’ అవకతవకలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ నీట్ వ్యవహారంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ నేత మానిక్క ఠాగూర్ ఈ తీర్మానాన్ని ఇచ్చారు. పరీక్షా నిర్వహణలో ఎన్టీఏ విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నీట్ పేపర్ లీకుపై సమగ్ర చర్చ జరిగిన తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Read Also: Inzamam-ul-Haq: భారత్ ఫైనల్‌కి చేరడంపై పాకిస్తాస్ అక్కసు.. టీం ఇండియాకి వేరే రూల్స్ అంటూ..
విద్యార్థులకు సభ నుంచి ఓ సందేశం ఇవ్వాల్సి ఉందని, అధికార-ప్రతిపక్షాలు విద్యార్థులకు భరసా ఇవ్వాలని ఆయన అన్నారు. అయితే, రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం తర్వాత ఈ వ్యవహారాన్ని చర్చిద్ధామని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీనికి ప్రతిపక్షాలు అంగీకరించలేదు. తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభను స్పీకర్ సభను వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో నీట్ అంశాన్ని చర్చించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లతికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే అధికార ఎన్డీయే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంతో పాటు ఎమర్జెన్సీపై చర్చించాలని అనుకుంటోంది.