Site icon NTV Telugu

Haryana: హర్యానా సీఎం సైనీ నివాసానికి బాంబు బెదిరింపు.. హైఅలర్ట్ ప్రకటన

Haryanacmsaini

Haryanacmsaini

హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అధికారిక నివాసానికి, రాష్ట్ర సచివాలయానికి శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. డాగ్ స్క్వాడ్‌తో సీఎం నివాసాన్ని, సెక్రటేరియట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇక సచివాలయ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. అలాగే భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చండీగఢ్ పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Rajendra Prasad: 15 రోజుల వెకేషన్లో సినిమా చేస్తే ఏడాది ఆడింది

నయాబ్ సింగ్ అధికారిక నివాసం సంత్ కబీర్ కుటిర్‌లో.. సచివాలయం చండీగఢ్‌లో ఉంది. ఈ రెండింటిని ఆత్మాహుతి దాడితో పేల్చేబోతున్నామంటూ ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఐఈడీలు ఉపయోగించి ఆత్మాహుతి దాడి జరగవచ్చన్న సందేశం భారీ పరిశ్రమల కార్యదర్శికి వచ్చింది. మధ్యాహ్నం 3:15 నిమిషాలకు ఈ బెదిరింపు వచ్చింది. దీంతో హర్యానా సీఐడీ అప్రమత్తం అయింది. సీఐఎస్ఎఫ్ మరియు పోలీసులు అత్యవసర చర్యలు తీసుకుని రెండు ప్రాంగణాలను ఖాళీ చేయించారు. లోపల ఉన్నవాళ్లు వెంటనే బయటకు రావాలని పోలీసులు ప్రకటన చేశారు. బయటకు రాగానే తనిఖీలు నిర్వహించినట్లు చండీగఢ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్‌పాల్ సింగ్ తెలిపారు. బాంబు నిర్వీర్య దళం, అగ్నిమాపక దళం, అంబులెన్స్, క్విక్ రియాక్షన్ బృందాలు, డాగ్ స్క్వాడ్ హై సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: JC Prabhakar Reddy: ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయ సమాధే..! జగన్‌కు జేసీ కీలక సూచనలు

ఇటీవల పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం అయిన స్వాస్థ్య భవన్‌పై బాంబు దాడి చేయబోతున్నట్లు ఈ మెయిల్ బెదిరింపు వచ్చింది. రెండు రోజుల తర్వాత ఇప్పుడు హర్యానాకు కూడా అదే తరహాలో బాంబు బెదిరింపు వచ్చింది. గత వారం మే 22న కూడా పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు ఇలాంటి బాంబు బెదిరింపే వచ్చింది. చండీగఢ్ పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని కొద్దిసేపు ఖాళీ చేయించారు. తనిఖీల తర్వాత బూటకమని తేల్చారు.

Exit mobile version