Boat Capsized in River Ganga Patna: బీహార్‌లోని దానాపూర్‌లోని షాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని గంగా నదిలో ఆదివారం 55 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడింది. 10 మంది గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఓ అధికారి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు పడవ బోల్తా పడిన సమాచారం తమకు అందిందని, వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని సంఘటనా స్థలానికి తరలించామని మానేర్ సిఒ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు.
“బోట్‌లో దాదాపు 50 మంది ప్రయాణిస్తుండగా అందులో 40-42 మంది సురక్షితంగా చేరుకున్నారు. అయితే 8-10 మంది గల్లంతయ్యారు. సోమవారం ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది’ అని సింగ్ తెలిపారు. నివేదికల ప్రకారం, కూలీలు పని నుండి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రయాణంలో ఉన్న వారందరూ పాట్నాలోని దౌద్‌పూర్ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
Bihar | Morning visuals from Danapur where a boat carrying 55 people capsized in Ganga river near Shahpur PS area, yesterday. 10 people were reported missing in the incident, search operation underway pic.twitter.com/dhXqKlM9w1
— ANI (@ANI) September 5, 2022
