పోలాల్లో పనిచేసేవారికి, అటవీ ప్రాంతంలో ఉన్నవారికి ఎక్కువ పాములు తారసపడుతుంటాయి. అందులో ఎక్కువ విషపూరితమైన పాములే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పాములు కనిపిస్తే .. మనం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంటాం. కొందరు ధైర్యం చేసి వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతుంటారు. అటువంటి పాములకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also:Man Rescues Snakes:వామ్మో.. 100పైగా పాములను సముద్రంలో వదిలిన యువకుడు..
సాధారణంగా పాములు అడవులు, పొలాలు, గడ్డివాములు, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తాయి. పాములు నలుపు, ముదరు పచ్చ లేక పోతే.. బురద రంగులో ఉంటాయి. కానీ ఓ రైతు తన పొలంలో పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా ఒక నీలం రంగు నాగు పాము నేల నుంచి బయటకు వచ్చింది. అది బుసలు కొడుతూ బయటకు రావడంతో భయపడ్డాడు రైతు. చాలా సేపు ఆ రైతు పామును తరిమేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికి పాము మాత్రం అక్కడి నుంచి కదలకుండా అలానే ఉండిపోయింది. కొంత సేపటికి పాము అలా పొదల వైపు వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొందరు వ్యక్తులు ఆ నీలి రంగు పాము పడగ విప్పి నిలబడడాన్ని… కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also:Father Kills Man: బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడు.. తండ్రి ఏం చేశాడంటే..
ఈ రకమైన నీలం పాములు చాలా అరుదుగా బయటకు వస్తాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. వర్షాకాలం ముగిసిన తర్వాత లేదా వాతావరణ మార్పుల సమయంలో ఇవి బైటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. రైతులు, గ్రామీణులు ఇలాంటి పాములను చూసినప్పుడు దూరంగా ఉండి, వాటిని చంపకుండా.. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆ నీలం పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ పామును చూసి ఆశ్చర్యపోతూ.. ‘ఇంత అందమైన పాము నిజంగా ఉందా?.. లేక ఇది ఏఐ వీడియోనా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఫిల్డర్ వాడి పాము కలర్ మార్చారని చెబుతున్నారు.
