పంజాబ్‌లోని లుథియానా కోర్టులో భారీ పేలుడు జరిగింది.. కోర్టు కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో పేలుడు సంభవించగా… ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.. ఇక, పేలుడు ధాటికి భవనం ధ్వంసమైంది… ఈ పేలుడు ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. భవనంలోని రెండో అంతస్తులోని బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12:22 గంటల ప్రాంతంలో పేలుడు జరిగినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు బాత్రూమ్ గోడలు దెబ్బతిన్నాయి మరియు సమీపంలోని గదుల అద్దాలు పగిలిపోయాయి.. జిల్లా కోర్టు పని సమయంలోనే ఈ పేలుడు జరిగింది.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై.. ఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు.. మరియు అగ్నిమాపక యంత్రాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి..
పేలుడు సంభవించిన జిల్లా కోర్టు లుధియానా నగరం నడిబొడ్డున జిల్లా కమీషనర్ కార్యాలయానికి సమీపంలో ఉంది. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. ఈ ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా పంజాబ్ పోలీసులకు ట్వీట్ చేశారు.. ఇక, పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద దళాల నుండి రాష్ట్రానికి ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.. మరోవైపు రక్షణ కోసం సరిహద్దు భద్రతా దళం (BSF)ను, 25 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) మరియు యాంటీ డ్రోన్ గాడ్జెట్‌లను కోరారు అమరీందర్ సింగ్.
