ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంటే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది ఇప్పుడు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు.. భారత్‌లో చాలా ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగు చూస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బయటపడ్డాయి.. దీంతో. అప్రమత్తమైన కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకుంది.. బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఇక, బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించిన వెంటనే వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. ప్రంపంచంలో ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు భారత్‌లోనే ఉన్నట్టుగా గుర్తించింది కేంద్రం.. దీంతో.. ఆ వ్యాధిని అంటువ్యాధిగా గుర్తించాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. కాగా.. ఇప్పటికే బ్లాక్ ఫంగస్‌ను రాజస్థాన్ రాష్ట్రం అంటువ్యాధిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇక, బ్లాక్ ఫంగస్ కట్టడికి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు.
కలవరపెడుతోన్న బ్లాక్ ఫంగస్.. కేంద్రం కీలక నిర్ణయం
Black Fungus