NTV Telugu Site icon

Yusuf Pathan : ఆక్రమణకు పాల్పడినట్లు యూసుఫ్ పఠాన్ పై ఆరోపణలు.. నోటీసులు జారీ

New Project (65)

New Project (65)

Yusuf Pathan : పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపీ యూసఫ్ పఠాన్ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భూమి ఆక్రమణకు సంబంధించి యూసుఫ్ పఠాన్‌కు ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (విఎంసి) నోటీసు పంపింది. ఈ భూమి కార్పొరేషన్‌కు చెందినదని, మాజీ క్రికెటర్ కబ్జా చేశారని విఎంసి చెబుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకే జూన్ 6న బీజేపీ అధికారంలో ఉన్న కార్పొరేషన్ ఈ నోటీసును పంపింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also:Gautham Ghattamaneni: వారసుడు రెడీ అవుతున్నాడు.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

బీజేపీ మాజీ కౌన్సిలర్ విజయ్ పవార్ ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శీతల్ మిస్త్రీ గురువారం మీడియాతో దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి జరిగిన ఎన్నికల్లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. అంతకుముందు, పవార్ విలేకరులతో మాట్లాడుతూ.. 2012లో మాజీ క్రికెటర్‌కు ప్లాట్‌ను విక్రయించాలన్న వీఎంసీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అయితే ఇటీవల ఎంపీ అయిన పఠాన్ ప్లాట్‌లో గోడను అక్రమంగా నిర్మించారని ఆరోపించారు.

Read Also:T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!

యూసఫ్ పఠాన్‌పై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పవార్ తెలిపారు. 2012 సంవత్సరంలో పఠాన్ ఒక ప్లాట్‌ను వీఎంసీ నుండి కొనుగోలు చేయాలని భావించారు. ఎందుకంటే ఆ సమయంలో అతని ఇల్లు ఆ ప్లాట్‌కు ఆనుకుని నిర్మాణంలో ఉంది. అతను ఈ ప్లాట్ కోసం చదరపు మీటరుకు సుమారు రూ. 57,000 కూడా ఆఫర్ చేశాడు. ఆ సమయంలో పఠాన్ ప్రతిపాదనకు వీఎంసీ ఆమోదం తెలిపింది. జనరల్ బోర్డు సమావేశంలో కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అయితే, ఇలాంటి విషయాల్లో తుది నిర్ణయం తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆమోదించలేదు. ఆ తర్వాత ప్లాట్ చుట్టూ ఎలాంటి కంచెను ఏర్పాటు చేయలేదు. ఆ ప్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి పఠాన్ ఆక్రమించాడని తర్వాత తెలిసిందని పవార్ అన్నారు. 978 చదరపు మీటర్ల ప్లాట్‌ ఆక్రమణకు సంబంధించి అతనికి నోటీసు అందజేసినట్లు చెప్పారు.