NTV Telugu Site icon

BJP: మళ్లీ ఎన్డీఏదే అధికారం, బీజేపీకి 333కి పైగా సీట్లు.. తాజా సర్వేలో వెల్లడి..

Bjp

Bjp

BJP: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే తాజాగా వెల్లడించింది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లకు చేరువకు వస్తుందని అంచనా వేసింది. సర్వే ప్రకారం.. ఎన్డీయేకి 358-398 మధ్య సీట్లు వస్తాయని, ఇందులో బీజేపీకి స్వతహాగా 333-363 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పింది.

ఇండియా కూటమికి 110-120 మధ్య సీట్లు దక్కే అవకాశం ఉందని సర్వే చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి 28-48 స్థానాలు మించకపోవచ్చని తెలిపింది. తమిళనాడులో డీఎంకే కూటమికి 24-28 సీట్లు దక్కే అవకాశం ఉంది. 42 లోక్ సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మమతా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ 17-21 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో బీజేపీకి 20-24 సీట్లు రావచ్చని పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 5-7 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే ప్రిడిక్ట్ చేయడం విశేషం. ఒడిశాలో బిజూ జనతాదళ్‌కి 10-11 సీట్లు వస్తాయని తెలిపింది.

Read Also: Pakistan: పాక్ అధ్యక్షుడిగా మరోసారి జర్దారీ ఎన్నిక

యూపీ, బీహార్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని సర్వే తెలిపింది. యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 72-78 స్థానాలో జయకేతనం ఎగరేస్తుందని, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి ఒకటి నుంచి రెండు స్థానాలు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇక గుజరాత్‌లో బీజేపీ మొత్తం 26 స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తుందని చెప్పింది. బీహార్‌లోని 42 ఎంపీ సీట్లలో జేడీయూ-బీజేపీ కూటమి 31-36 స్థానాలను గెలుచుకుంటుందని, ఆర్జేడీ-కాంగ్రెస్ కేవలం 2-4 సీట్లకు పరిమితవుతుందని అంచానా.

ఇక 48 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి 34-38 సీట్లను కైవసం చేసుకోగా, కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్)- శివసేన(ఉద్ధవ్) 9-13 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా బీజేపీ సత్తా చాటనుంది. ఎన్డీయే కూటమికి 22-24 సీట్లు వస్తే, కాంగ్రెస్‌కి 4-6 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. ఇక తెలంగాణలో 17 స్థానాలకు గానూ బీజేపీకి 5, కాంగ్రెస్‌కి 9, టీఆర్ఎస్‌కి 2, ఎంఐఎంకి 1 స్థానంలో గెలుపొందుతుందని చెప్పింది.