Site icon NTV Telugu

Odisha: ఒడిశాలో దారుణం.. ఆఫీస్‌లోనే అధికారిని కొట్టిన బీజేపీ నేతలు

Odishabmc

Odishabmc

ఒడిశాలో దారుణం జరిగింది. రాజధాని భువనేశ్వర్‌లో అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు రెచ్చిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కార్యాలయంలో ఒక సీనియర్ అధికారిపై బీజేపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఘాతుకానికి పాల్పడ్డారు. కార్యాలయంలోనే బీఎంసీ అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై భౌతిక దాడికి పాల్పడ్డారు. మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. సీనియర్ అధికారిని కొందరు ఈడ్చుకుని వెళ్తుండగా.. ఇంకొందరు కాళ్లతో తన్నుతో కనిపించారు. బయటకు లాక్కుంటూ వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు.. అధికార పార్టీపై భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని దుమ్మెత్తిపోశాయి.

ఇది కూడా చదవండి: Dilraju : రామ్ చరణ్‌ వల్లే నష్టాల నుంచి బయటపడ్డా

ఈ ఘటనపై కార్పొరేషన్ ఉద్యోగులు మండిపడ్డారు. కార్యాలయంలోనే దాడికి పాల్పడితే తమకు రక్షణ ఎవరి కల్పిస్తారని నిలదీస్తున్నారు. దాడిని నిరసిస్తూ కార్యాలయం ఎదుటనే ఉద్యోగులంతా ధర్నాకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దాడికి నిరసనగా ఒడిశా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ జూలై 1 నుంచి సామూహిక సెలవు తీసుకోవాలని నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: Group-1 : నేడు తెలంగాణ గ్రూప్‌-1 పిటిషన్లపై విచారణ

ఇక వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇక ఈ సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది క్రూరమైన చర్యగా అభివర్ణించారు. దాడికి కుట్రపన్ని రాజకీయ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.

మరో బీజేడీ నాయకుడు అశోక్ పాండా స్పందిస్తూ.. ఇది అనాగరిక చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛన్నం కావడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అధికారులే సురక్షితంగా లేనప్పుడు.. ఇక సామాన్యుల సంగతేంటి? అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని.. ప్రధాన కుట్రదారుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ దాడిని కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా ఖండించింది. బీజేపీ పాలనలో చట్టవిరుద్ధతకు ఉదాహరణగా అభివర్ణించారు. బీజేపీ నాయకుడు అపరూప రౌత్, అతని అనుచరులు అధికారిని కొట్టారని.. కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

కార్యాయలంలో ఫిర్యాదు విచారణ సందర్భంగా తనపై దాడి జరిగినట్లుగా బాధిత అధికారి సాహూ తెలిపారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఫిర్యాదు విచారిస్తుండగా కార్పొరేటర్ జీవన్ రౌత్ సహా అతని అనుచరులు ఛాంబర్‌లోకి దూసుకొచ్చారని చెప్పారు. వచ్చీరాగానే అతనితో పాటు వచ్చిన వ్యక్తులు తనతో దురుసుగా ప్రవర్తించారని.. అనంతరం దాడి చేశారన్నారు. కార్యాలయం నుంచి బయటకు లాగి.. బలవంతంగా కారు దగ్గరు తీసుకెళ్లారన్నారు.

 

Exit mobile version