Site icon NTV Telugu

Devyani Rana: జమ్మూకాశ్మీర్ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజ.. విక్టరీ దిశగా దేవ‌యాని రాణా

Devyani Rana2

Devyani Rana2

దేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఆయా చోట్ల జరిగిన బైపోల్స్‌లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. ఇక జమ్మూకాశ్మీర్‌లో న‌గ్రోటా స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవ‌యాని రాణా ముందంజలో దూసుకెళ్తున్నారు.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఆర్జేడీలో గుబులు.. వెనుకంజలో ముఖ్యమంత్రి క్యాండిడేట్

దేవ‌యాని రాణా.. నగ్రోటా మాజీ ఎమ్మెల్యే, దివంగత దేవేందర్ సింగ్ రాణా కుమార్తె. ఈ ఏడాది ప్రారంభంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఏడాది జనవరిలో భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) ఉపాధ్యక్షురాలిగా కూడా నియమితులయ్యారు. దేవేందర్ సింగ్ మరణంతో నగ్రోటా బైపోల్ ఎన్నిక వచ్చింది. ఇదే స్థానం నుంచి బీజేపీ తరపున దేవయాని రాణా బరిలోకి దిగారు. ప్రస్తుతం ముందంజలో కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: Bihar Elections Result: 200 మార్కు దిశగా ఎన్డీఏ.. తగ్గుతున్న ఆర్జేడీ లీడ్

Exit mobile version