ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో కీలక బిల్లు ఆమోదించింది. ‘లవ్ జిహాద్’ బిల్లుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై దోషులకు యావజ్జీవం శిక్ష పడే అవకాశం ఉంటుంది. బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతిమార్పిడికి పాల్పడే వారికి శిక్ష శిక్ష మరింత పెరగనుంది. ఇలాంటి వారికి గరిష్టంగా యావజ్జీవ జైలుశిక్ష పడుతుంది.
ఇది కూడా చదవండి: Paris Olympics 2024: భారత పురుషుల హాకీ జట్టుకు మరో విజయం
సవరించిన నిబంధనల ప్రకారం మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, వివాహం చేసుకోవడం, వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ కేసుల్లో 20 ఏళ్లు జైలు శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడన వారికి పదేళ్ల జైలు, రూ.50,00 జరిమానా ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ, ఫిర్యాదు కానీ బాధితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది.
ఇది కూడా చదవండి: Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. ఏడుగేట్లు ఎత్తివేత..!