Site icon NTV Telugu

Dhurandhar: పాక్‌లో “ధురంధర్” బ్యాన్.. కానీ, వైరల్ సాంగ్‌తో చిన్న భుట్టో ఎంట్రీ..

Bilawal Bhutto

Bilawal Bhutto

Dhurandhar: బాలీవుడ్ మూవీ ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్‌లో ఉన్న ప్రో-పాకిస్తాన్ నారెటివ్‌ను పటాపంచలు చేసిందని పలువురు క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ అసలు రూపాన్ని ఈ సినిమా చూపించిందని చెబుతున్నారు. ఆదిత్య ధార్ డైరెక్షన్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్‌, మాధవన్‌లు కీలక పాత్రల్ని పోషించారు. పాకిస్తాన్‌లో భారత ఏజెంట్లు ఎలా పనిచేస్తారనే దానితో పాటు పాక్ ఐఎస్ఐ-ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ సంబంధాలను ఈ సినిమా చూపించింది. ముఖ్యంగా, కరాచీలోని ల్యారీ గ్యాంగ్, గ్యాంగ్‌స్టర్ రహమాన్ డకైత్‌, గ్యాంగ్ స్టర్-రాజకీయ సంబంధాలను సినిమా చూపించింది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో FA9LA సాంగ్ వైరల్ అవుతోంది. అక్షయ్ ఖన్నాను చూపిస్తూ సాగే ఈ సాంగ్ భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఏ పార్టీలో చూసినా కూడా ఇదే సాంగ్ వినిపిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, రాజకీయాలను చూపించినందుకు ఈ సినిమాను ఆ దేశంలో బ్యాన్ చేశారు. అయినా కూడా ఆ దేశంలో ఈ వైరల్ సాంగ్ వినిపిస్తూనే ఉంది. బహ్రెయిన్ సింగన్ నవాఫ్ ఫహెద్ అలియాస్ ఫ్లిప్పరాచి పాడిన ఈ ప్రసిద్ధ పాట పాకిస్తాన్‌లోని ఒక పార్టీలో ప్లే అవుతున్న వీడియో వైరల్ అయింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీసీ) అధినేత బిలావల్ భుట్టో ఈ పార్టీలో ఉండటం విశేషం.

Read Also: Rajeev Shukla-BCCI: మ్యాచ్‌ రద్దుపై ఫాన్స్ ఫైర్.. స్పందించిన బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌!

భుట్టోను వేదికపైకి స్వాగతించే సమయంలో, ధురంధర్ లోని FA9LA పాట ప్లే అవుతుండగా అతను కూర్చోవడం కనిపించింది. నిజానికి, ఈ సినిమాలో కొన్ని సీన్లలో పాక్ మాజీ ప్రధాని, దివంగత బెనజీర్ భుట్టో ఫోటోలు ఉండటం వివాదాస్పదమైంది. దీనిని వ్యతిరేకిస్తూ.. పీపీపీ పార్టీ కరాచీ కోర్టులో సినిమాకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలు చేసింది. ధురంధర్ సినిమా నటీనటులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

పాక్‌తో సహా గల్ఫ్ దేశాల్లో నిషేధం:

పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఈ సినిమా ఉందని పాక్‌తో పాటు గల్ప్ దేశాలు ధురంధర్‌ను నిషేధించాయి. 1999 కందహార్ విమాన హైజాకింగ్, ముంబై 26/11 దాడులు, ల్యారీ గ్యాంగ్ గురించి చెప్పడం పాక్ ప్రభుత్వానికి నచ్చలేదు. అయినప్పటికీ, ఈ సినిమాను పాక్‌లో చాలా మంది అక్రమంగా డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నారు. రెండు వారాల్లోనే ఈ సినిమా కనీసం 20 లక్షల అక్రమ డౌన్‌లోడ్లు అయినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇది రజనీకాంత్ రోబో 2.0, షారుఖ్ ఖాన్ రయీస్ చిత్రాలను అధిగమించింది. పాకిస్థాన్‌లో నిషేధం వల్ల సినిమా నిర్మాతలకు రూ. 50-60 కోట్లు నష్టం వాటిల్లి ఉండవచ్చు, కానీ పాకిస్థాన్ ఒక పూర్తి ఉగ్రవాద దేశం అనే సందేశం పాకిస్థాన్ అంతటా చేరింది.

Exit mobile version