ఫుట్ పాత్ ఉన్నది కేవలం పాదాచారులకు మాత్రమే.. వారు రోడ్లపై నడవలేరు కాబట్టి.. ప్రభుత్వం వారికి ఫుట్ ఫాత్ లు కట్టింది. వాటిని వదలకుండా కొందరు స్టంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఫుట్‌పాత్స్ పై యువకుడు స్టంట్స్ వేయడంతో బొక్క బోర్లా పడ్డారు..
పూర్తి వివరాల్లోకి వెళితే..ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇద్దరు బైకర్లు ఫుట్‌పాత్‌పై వేగంగా దూసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వైరల్ అయిన తర్వాత ఈ బైకర్స్ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తర్వాత జరిగింది చూసి తగిన శాస్తి జరిగిందంటూ నవ్వుకున్నారు.
బైక్‌పై స్పీడ్‌గా వెళ్లిన యువకుడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత నియంత్రణ కోల్పోయి ఫుట్‌ఫాత్‌పై నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాద సమయంలో వారిద్దరికి హెల్మెట్స్ కూడా లేవు. బైక్ నియంత్రణ కోల్పోయిన వెంటనే ఇద్దరు యువకులు ఎగిరి పడిపోయారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. చాలా మంది నెటిజన్లు బైకర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయగా, కొందరు ఈ చర్యను ‘ఫిట్టింగ్‌గా అభివర్ణించారు.
Speeding on a footpath.
What can go wrong. #roadsafety #footpath pic.twitter.com/qxcjy7Hk1z— RushLane (@rushlane) September 19, 2025
