Bihar Man Won 1 Crore Rupees In Dream11 App: అదృష్టం వరించి, రాత్రికిరాత్రే కోటీశ్వరులు లేదా లక్షాధికారులు అయిన సంఘటనలు అరుదుగా చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు బిహార్‌లోనూ అలాంటి పరిణామమే వెలుగు చూసింది. కేవలం రూ. 49 మాత్రమే బెట్టింగ్ వేసి, ఏకంగా కోటి రూపాయలు కొట్టేశాడు ఒక వ్యక్తి. అతని పేరు రాజురామ్. ఇతను బిహార్‌లోని నవాదా జిల్లా పిప్రా గ్రామానికి చెందినవాడు. స్థానిక వేడుకల్లో డీజేగా పని చేసే రాజురామ్.. ఏడాదిన్నరగా ‘డీమ్11’లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ యాప్ ద్వారా అతనికి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోయినా.. ఏదో ఒక రోజు అదృష్టం తలుపుతట్టదా? అనే నమ్మకంతో, అందులో బెట్టింగ్ వేస్తూ వచ్చాడు.
Police Officer House Robbed: ఇంట్లో చోరీ.. బాబా సాయం కోరిన పోలీస్ అధికారి
ఈ క్రమంలోనే రాజురామ్ తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీకి సంబంధించి రూ. 49తో పందెం కాశాడు. బ్రిస్బేన్ హిట్, సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. తనకు నచ్చిన ఉత్తమ ఆటగాళ్లతో జట్టుని ఎంపిక చేసుకున్నాడు. ఆ జట్టే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో.. అతనికి రూ. 1 కోటి జాక్‌పాట్ తగిలింది. పన్నులకు రూ. 30 లక్షలు పోగా.. మిగిలిన రూ. 70 లక్షలు రాజురామ్ ఖాతాలో జమ అయ్యాయి. ఈ జాక్‌పాట్ తగలడంతో రాజురామ్ కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగి తేలారు. తాను ఏడాదిన్నర నుంచి డ్రీమ్11లో పందెం కాస్తున్నానని, చివరికి ఇన్నాళ్ల తర్వాత తనకు అదృష్టం వరించిందని రాజురామ్ చెప్పుకొచ్చాడు. తనకొచ్చిన ఈ సొమ్ముతో సొంతంగా ఒక వ్యాపారం నిర్వహిస్తానని చెప్పాడు.
Cristiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్.. చరిత్రలో ఎన్నడూ లేని భారీ డీల్
నిజానికి.. రాజురామ్‌ది నిరుపేద కుటుంబం. వేడుకలు ఉంటే తప్ప.. రాజుకి పని దొరికేది కాదు. వేడుకల సమయంలో మాత్రమే డీజేగా పని చేస్తూ, జీవనం కొనసాగిస్తుంటాడు. ఉండటానికి ఇల్లు ఉంది కానీ, అదేం పెద్దది కాదు. సిమెంట్‌తో ప్లాస్టింగ్ కూడా చేయని ఒక సాధారణ ఇల్లు. కనీస సౌకర్యాలు కూడా లేవు. ఇంటిల్లిపాది రోజు వారి కూలీకి వెళ్తే గానీ కుటుంబం గడవదు. అలాంటి రాజు కుటుంబం ఇప్పుడు డ్రీమ్11 పుణ్యమా అని.. లక్షాధికారులయ్యారు.