Site icon NTV Telugu

Bihar: గొప్పోడివయ్యా.. భార్యకు ఆమె లవర్‌తో పెళ్లి చేయించిన భర్త.. వీడియో వైరల్..

Bihar

Bihar

Bihar: ఇటీవల వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. కొన్ని కేసుల్లో మహిళలు తమ ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేస్తుంటే, మరికొన్ని కేసుల్లో భర్తలు, భార్యలను హత్య చేస్తున్నారు. ఇలా వివాహేతర సంబంధాలు విషాదంగా మిగులుతున్నాయి. ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు ఆమె ఇష్టపడిని వ్యక్తితో పెళ్లి జరిపించాడు. దగ్గరుండీ మరీ ఇద్దరి పెళ్లి చేశాడు. సినిమాల్లో సాధ్యమయ్యే ఇలాంటి సన్నివేశాలు ఇప్పడు రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయని నిరూపించాడు.

Read Also: Uddhav Thackeray: మొదట శివసేన, ఇప్పుడు ఎన్సీపీ, తర్వాత మహారాష్ట్రను బీజేపీ విడగొడుతుంది..

వివరాల్లోకి వెళితే బీహార్ నవడాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించడం చర్చనీయాంశంగా మారింది. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సందర్భంలో అతని భార్య అర్థరాత్రి ప్రియుడిని కలిసేందుకు అతని ఇంటికి వెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ జంటను వారి కుటుంబసభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని బంధించి కొట్టారు. ఆగ్రహించిన గ్రామస్థులు వీరిద్దరూ ఊరు వదిలి వెళ్లాలని ఆదేశించారు.

ఇదిలా ఉంటే ఈ విషయం గురించి తెలుసుకున్న భర్త గ్రామానికి తిరిగి వచ్చి స్థానికంగా ఉన్న గుడికి తీసుకెళ్లి భార్యకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేశాడు. ఇదిలా ఉంటే మహిళ ప్రియుడికి అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయం గురించి అధికారులను ప్రశ్నిస్తే.. తమకు దీని గురించి తెలియదని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివాలయంలో మహిళ ఏడుస్తుంటే, ప్రియుడు ఆమె నుదుట సింధూరం పెడుతుండటం వీడియోలో చూడవచ్చు.

Exit mobile version