Bihar Courts Dismissed 2 Rupees Bribe Case On 5 Police Constables After 37 Years: కొన్ని కేసుల విచారణలు ఎక్కువకాలం నడుస్తాయన్న విషయం అందరికీ తెలుసు. అవినీతి కేసులు కూడా కొన్ని సంవత్సరాల వరకు సాగుతాయి కానీ, మరీ 37 సంవత్సరాలు సాగిన దాఖలాలైతే లేవు. కానీ.. ఒక కేసు విచారణ మాత్రం అంత సుదీర్ఘకాలం వరకు నడిచింది. అది కూడా లక్షల్లో, కోట్లలో అవినీతి జరగలేదు. కేవలం రెండే రెండు రూపాయల అవినీతి జరిగిన కేసు అది. వాహనదారుల నుంచి ఐదుగురు పోలీసులు రూ.2 లంచం తీసుకున్నారని 1986లో నమోదైన ఈ కేసులో.. ఇన్నేళ్ల తర్వాత వాళ్లు నిర్దోషులంటూ బిహార్‌లోని ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Tilak Varma Sixes: తొలి 3 బంతుల్లో 2 సిక్స్‌లు.. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రమే అదుర్స్!
భాగల్‌పుర్ పరిధిలోని ఓ చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు పోలీసులు.. వాహనదారుల నుంచి రూ.2 లంచం వసూలు చేస్తున్నారని బెగుసరాయ్ ఎస్పీ అరవింద్ వర్మకు ఫిర్యాదులు అందాయి. 1986 జూన్ 10వ తేదీన ఒక వ్యక్తి నుంచి ఆయనకు ఈ ఫిర్యాదు అందింది. దీంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఎస్పీ భావించారు. అందుకు ఒక ప్రణాళిక రూపొందించారు. చెక్‌పోస్ట్ వైపుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఆపి.. రూ.2 నోటుపై తన సంతకం చేసి, ఆ నోటును డ్రైవర్‌కు ఇచ్చారు. ఒకవేళ పోలీసులు లంచం అడిగితే.. తాను సంతకం చేసిన నోటునే వారికి ఇవ్వాలని సూచించారు. అనంతరం.. వాహనదారుడు చెక్‌పోస్ట్ వద్దకు చేరుకోగానే.. పోలీసులు అతనికి రూ.2 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆ డ్రైవర్ ఎస్పీ సంతకం చేసిచ్చి నోటుని ఒక కానిస్టేబుల్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎస్పీకి తెలియజేశాడు.
Mamata Banerjee: అమిత్ షా చెప్పింది కరెక్టే.. బిగ్ షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ
ఎట్టకేలకు తనకు వచ్చిన ఫిర్యాదు నిజమేనని నిర్ధారించుకున్న ఆ ఎస్పీ.. వెంటనే చెక్‌పోస్ట్ వద్దకు వెళ్లారు. కానిస్టేబుల్ జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన నోటును స్వాధీనం చేసుకొని.. ఆ ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. అలా 1986 నుంచి మొదలైన ఈ కేసు విచారణ.. 2023 ఆగస్టు దాకా సాగింది. చివరికి.. సరైన ఆధారాలు లేకపోవడంతో కేసుని కొట్టివేస్తూ.. రామరతన్ శర్మ, కైలాష్ శర్మ, జ్ఞాని శంకర్, యుగేశ్వర్ మహ్తో, రామ్ బాలక్ రాయ్ అనే ఐదుగురు పోలీసుల్ని కోర్టు నిర్దోషులుగా తేల్చింది.
