Samrat Choudhary: బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు.. ఒకరు అరెస్ట్

  • బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు
  • ఫోన్ చేసి చంపేస్తానంటూ బెదిరింపు
  • గుజరాత్‌లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Samrat Choudhary

Samrat Choudhary

బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో విషయం పోలీసులకు తెలియడంతో ఉలిక్కిపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ నెంబర్‌పై నిఘా పెట్టారు. సాంకేతిక సాయంతో నిందితుడి గుర్తింపు గుజరాత్‌లో కనిపెట్టారు. ముంగేర్ పోలీసుల ప్రత్యేక బృందం గుజరాత్ చేరుకుని సనంద్ ప్రాంతంలో నిందితుడు శేఖర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

ఇటీవల సామ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇలాంటి తరుణంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి చంపేస్తానంటూ బెదిరింపు రావడంతో సంచలనంగా మారింది. పోలీసులు నిందితుడి ఫోన్ ట్రాకింగ్ చేసి శేఖర్ యాదవ్‌ను  అరెస్టు చేశారు.  అయితే ఒక ముఖ్యమంత్రిని ఎందుకు చంపుతానని బెదిరించాల్సి వచ్చింది అన్న దానిపై విచారించనున్నారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్‌కు తీసుకువస్తున్నారు.

బీహార్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో బీజేపీకి అవకాశం దక్కింది. జేడీయూ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి 29 శాఖలు నిర్వహిస్తుండగా.. జేడీయూకు 18 శాఖలు కేటాయించారు.