WhatsApp Marriage: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఓ పెళ్లి సంచలనంగా మారింది. వాట్సాప్‌లో ఓ జంట పెళ్లి చేసుకోవడం వార్తల్లో నిలిచింది. అయితే, వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, యువతీయువకులు మాత్రం పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా కలిసి ఉండేందుకు పట్టుబడుతున్నారు.
Read Also: Human Brain: మనిషి చనిపోయే ముందు “మెదడు”లో ఏం జరుగుతుంది.. షాకింగ్ రిజల్ట్స్..
ఇంటర్మీడియల్ విద్యార్థులు అయిన అమ్మాయి, అబ్బాయి వాట్సాప్ మెసేజ్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి ‘‘కాబూల్ హై’’(నేను అంగీకరిస్తున్నాను) అని మూడు సార్లు పంపాడు. దీనికి రిప్లైగా ఇదే విధంగా అమ్మాయి కూడా ‘‘కాబూల్ హై’ అంటూ చెప్పింది. అబ్బాయి ఆమెను తన భార్యగా పరిగణించేలా మెసేజ్‌లు పంపించుకున్నారు. అయితే, ఇరు కుటుంబాలు ఈ వాట్సాప్ పెళ్లిని అంగీకరించడానికి నిరాకరించాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
బాలుడు, రెండు ఏళ్లుగా బాలికతో సంబంధంలో ఉన్నాడు. అయితే, వీరిద్దరు విభిన్న సమాజ నేపథ్యాలు కావడంతో ఇరు కుటుంబాలు దీనికి ఒప్పుకోలేదు. ఆదివారం బాలుడు, అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని పోలీస్ స్టేషన్‌లో రెండు గంటల పాటు సీన్ క్రియేట్ చేశాడు. వీరిద్దరి మొబైల్ ఫోన్లు పరిశీలించగా.. ‘‘కాబూల్ హై’’ అనే మెసేజ్‌లు పోలీసులకు కనిపించాయి. పోలీసులు గంటల తరబడి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ, బాలుడు బాలికతోనే ఉండాలని దృఢంగా పట్టుపట్టాడు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఇరు కుటుంబాల నుంచి అధికారిక ఫిర్యాదు కోసం వేచి ఉన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వైపుల మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్నారు.