NTV Telugu Site icon

Maha Kumbh Mela: కుంభమేళాకి భూటాన్ రాజు… సంగమంలో పుణ్యస్నానం..

Bhutan King

Bhutan King

Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి భూటాన్ రాజు వచ్చారు. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఆయన త్రివేణి సంగమంతో పవిత్ర స్నానం చేశారు. దీనికి ముందు రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ సూర్యుడికి ‘‘అర్ఘ్యం’’ సమర్పించారు.

Read Also: PM Modi: మా లక్ష్యం వికసిత్ భారత్.. అందుకే ప్రజలు మూడోసారి ఆశీర్వదించారు

విమానాశ్రయానికి వచ్చిన రాజు భూటాన్ సంప్రదాయ దుస్తుల్ని ధరించారు. పవిత్ర స్నానం చేస్తున్న సమయంలో కాషాయ దుస్తుల్లో ఉన్నారు. వాంగ్‌చుక్, సీఎం ఆదిత్యనాథ్‌లతో పాటు ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రులు స్వతంత్ర దేవ్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా, విష్ణుస్వామి శాఖ నాయకుడు జగద్గురు సంతోష్ దాస్ మహారాజ్ (సతువా బాబా) కూడా ఉన్నారు.

త్రివేణి సంగమంలో జరిగిన పవిత్ర స్నానాల సమయంలో మతపరమైన ఆచారాలను యోగి ఆదిత్యనాథ్ వివరించినట్లు రాజు అధికారిక ప్రకటనలో తెలిపారు. స్నానం అనంతరం అక్షయవత్, బడే హనుమాన్ ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. సోమవారం థింపు నుంచి లక్నో చేరుకున్న రాజు, ఆ తర్వాత ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. లక్నోకి వచ్చిన ఆయనకు ళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆయనకు స్వాగతం పలికారు. గవర్నర్, ముఖ్యమంత్రి భారతదేశం-భూటాన్ సంబంధాలపై రాజుతో చర్చలు జరిపారు.