NTV Telugu Site icon

Bhupendrabhai Patel: నేడు గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణ స్వీకారం

Bhupendra Patel

Bhupendra Patel

Bhupendra Patel To Be Sworn In As Gujarat CM Today: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి అఖండ విజయాన్ని అందించిన భూపేంద్ర భాయ్ పటేల్.. నేడు రెండోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో ఉన్న కొత్త సెక్రటేరియట్ భవనంలో ఈ కార్యక్రమం జరగనుంది. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్ర ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, గత కేబినెట్ మంత్రులు హాజరు కానున్నారు. భూపేంద్రతో పాటు కొందరు మాజీ మంత్రులు సైతం ప్రమాణం చేయబోతున్నారని సమాచారం.

PM Modi: గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన మోదీ

కాగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 156 స్థానాలు గెలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితం కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలు మాత్రమే గెలిచింది. అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా అసెంబ్లీ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసిన భూపేంద్ర పటేల్.. తన ప్రధాన ప్రత్యర్థిపై 1.92 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. నిజానికి.. గతేడాది సెప్టెంబర్ వరకూ గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ కొనసాగారు. అయితే.. బీజేపీ హైకమాండ్ ఆయన్ను తొలగించి, భూపేంద్రను సీఎంగా కూర్చోబెట్టింది. తాజా విజయంతో ఆయన రెండోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత భూపేంద్ర పటేల్ శుక్రవారం తన ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఏర్పడింది.

Ishan Kishan: ఇషాన్ ఖాతాలో మరో రికార్డ్.. క్రికెట్ చరిత్రలోనే తొలి ఆటగాడు

కాగా.. భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగే భవనం, ఒక తాత్కాలిక భవనం. ఇందులో 20 వేల మంది వరకూ పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించుకుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఆఫీస్ బీరర్స్, రకరకాల మోర్చాల ఆఫీస్ బీరర్స్, ఏపీఎంసీల ఛైర్మన్లు, ఉప ఛైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, జనసంఘ్ పెద్దలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఐఏఎస్ అధికారులతో కూడిన ఓ ప్రత్యేకమైన కమిటీ పర్యవేక్షిస్తోంది.